Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మిల్లు నుండి ధాన్యం తరలింపు ఆరోపణలు కలకలం

Author MANA VISHWAM | 02 Aug 2026, 11:05 AM | Array
మిల్లు నుండి ధాన్యం తరలింపు ఆరోపణలు కలకలం

ప్రభుత్వ ధాన్యమేనా? ప్రైవేట్ నిల్వలా? స్పష్టత కరువు


​సంగెం మండలంలోని ఓ రైస్ మిల్లులో ఉదయం లారీలో ధాన్యం తరలించినట్లు ఆరోపణలు జోరుగా వినిపించాయి. ఆదివారం ఉదయం వాహనాల్లో ధాన్యాన్ని వేరే ప్రాంతాలకు తరలించారనే ప్రచారం మండలంలో జోరుగా సాగింది.

​ప్రభుత్వ ధాన్యమేనా.. ప్రైవేట్ నిల్వలా?

ఇవి కూడా చదవండి

అయితే ​మిల్లు నుంచి తరలించిన ధాన్యం ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యమా? లేక మిల్లు యాజమాన్యానికి సంబంధించిన ప్రైవేట్ నిల్వలా? అనే అంశంపై తీవ్ర అయోమయం నెలకొంది. దీనిపై స్థానికంగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు గానీ, మిల్లు యాజమాన్యం గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది.
​సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.