Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఆగస్టు 15 వేళ.. శంషాబాద్‌లో హై అలర్ట్‌

Author MANA VISHWAM | 12 Aug 2026, 09:23 AM | హైదరాబాద్
ఆగస్టు 15 వేళ.. శంషాబాద్‌లో హై అలర్ట్‌

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎయిర్‌పోర్టులో హై అలర్ట్‌ ప్రకటించి, ఈ నెల 31 వరకు సీఐఎస్‌ఎఫ్‌తో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
విమానాశ్రయ టెర్మినల్‌, పార్కింగ్‌ ప్రాంతాలతో పాటు కీలక ప్రదేశాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
భద్రతా చర్యల్లో భాగంగా విమానాశ్రయంలో సందర్శకుల పాసుల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించి పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేశారు. ఆగస్టు 15 నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.