Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

Author MANA VISHWAM | 13 Aug 2026, 09:57 PM | మహబూబాబాద్
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

రైల్వే పట్టాలు దాటుతున్న ఓ ఉపాధ్యాయుడిని రైలు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది. మృతుడిని మైనార్టీ గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎండీ గౌస్‌మియాగా గుర్తించారు.
మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో గౌస్‌మియా పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వచ్చిన పుష్‌పుల్‌ రైలు ఆయనను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు.
గౌస్‌మియా ఆకస్మిక మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పనిచేస్తున్న గురుకుల పాఠశాలలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు ఉపాధ్యాయులు, స్థానికులు గౌస్‌మియా మృతికి సంతాపం తెలిపారు.