Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘కాకా’గా మెగాస్టార్‌.. మాస్‌ లుక్‌తో అదరగొట్టిన చిరు!

Author MANA VISHWAM | 22 Aug 2026, 10:03 AM | Cinema
‘కాకా’గా మెగాస్టార్‌.. మాస్‌ లుక్‌తో అదరగొట్టిన చిరు!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 158వ చిత్రానికి ' కాకా ' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజా వీడియో వాటిని మరింత పెంచింది.
ఈ చిత్రంలో చిరంజీవి కె. సత్యం అనే అక్వా సంస్థ ఉద్యోగిగా కనిపించనున్నారు. సాధారణ మధ్యతరగతి వ్యక్తిని తలపించే ఆహార్యం, తన చుట్టూ ఉన్న వారితో కలిసిపోయే తీరు తొలి భాగంలో ఆకట్టుకుంటాయి. అయితే కథ అక్కడితో ఆగదు. ప్రశాంతంగా కనిపించే సత్యం వెనుక మరో పవర్‌ఫుల్‌ కోణం ఉందనే సంకేతాలను గ్లింప్స్‌లో ఇచ్చారు.
ఓ సందర్భంలో నీటిలో పడిపోయిన తాళాలు బయటకు తీసే క్రమంలో తుపాకులు ప్రత్యక్షమవడం.. అక్కడి నుంచి కథ ఒక్కసారిగా మాస్‌ మలుపు తిరగడం ఆసక్తి రేపుతోంది. ఆ వెంటనే యంగ్‌, స్టైలిష్‌ లుక్‌లో చిరంజీవి తుపాకీతో కనిపించే సన్నివేశాలు అభిమానులకు వింటేజ్‌ మెగాస్టార్‌ను గుర్తుచేసేలా ఉన్నాయి. ఒకే పాత్రలో సాదాసీదా వ్యక్తి నుంచి మాస్‌ అవతార్‌ వరకు రెండు భిన్న కోణాల్లో చిరంజీవిని బాబీ చూపించనున్నట్లు గ్లింప్స్‌ సూచిస్తోంది.
కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027జనవరి 13న' కాకా 'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.