Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రూ.75 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై!

Author MANA VISHWAM | 22 Aug 2026, 08:50 PM | Crime
రూ.75 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై!

కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై బండెల బాలరాజ్‌ ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌/రైటర్‌ బొట్ట రాఘవేంద్ర కుమార్‌పైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
చందానగర్‌ ఠాణాలో నమోదైన క్రైమ్‌ నంబరు 696/2026 కేసు దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై బాలరాజ్‌ ఫిర్యాదుదారుడిని రూ.75 వేలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది. శనివారం ఆ మొత్తాన్ని స్వీకరించగా రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై కార్యాలయంలోని టేబుల్‌ డ్రాయర్‌ నుంచి రూ.75 వేలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో ఎస్సై అంతకుముందే రూ.20 వేల నగదు తీసుకున్నారని, కానిస్టేబుల్‌ రాఘవేంద్ర కుమార్‌ మరో రూ.10 వేలను యూపీఐ ద్వారా స్వీకరించారని ఏసీబీ వెల్లడించింది. దీంతో మొత్తం రూ. 1.05లక్షలు తీసుకున్నట్లు పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

రూ.75 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై! - Additional Image