Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

హైదరాబాద్‌కు ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ క్యాంపస్‌!

Author MANA VISHWAM | 22 Aug 2026, 09:08 PM | INTERNATIONAL
హైదరాబాద్‌కు ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ క్యాంపస్‌!

హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ విశ్వవిద్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. లండన్‌లోని సెనేట్‌ హౌస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందంతో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్‌ ద్వారా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల విద్యా కోర్సులు, కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వర్సిటీ పరిధిలోని విద్యా విభాగాలను ఒకే అకడమిక్‌ ఫెడరేషన్‌గా అనుసంధానిస్తూ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.