Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తెలంగాణ నాన్‌క్యాడర్ అధికారులకు పదోన్నతి

Author MANA VISHWAM | 25 Aug 2026, 10:04 AM | TELANGANA
తెలంగాణ నాన్‌క్యాడర్ అధికారులకు పదోన్నతి

తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఏడుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది. రాష్ట్ర పోలీసు సర్వీసుకు చెందిన ఈ అధికారులను భారతీయ పోలీసు సేవ (ఐపీఎస్‌)కు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్ హోదా పొందిన వారిలో పులిగిల్ల రవీందర్, శ్రీ బాలదేవి, అరవింద్ బాబు, రాజ మహేంద్ర నాయక్, సాయిశ్రీ,, పూజ, కరుణాకర్ ఉన్నారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులతో వీరికి ఐపీఎస్ క్యాడర్‌లోకి పదోన్నతి లభించింది.
రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న వీరికి ఐపీఎస్ హోదా కల్పించడంతో ఇకపై ఉన్నతస్థాయి బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం లభించనుంది.