Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మైన్స్‌ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు

Author MANA VISHWAM | 27 Aug 2026, 10:39 AM | జయశంకర్ భూపాలపల్లి
మైన్స్‌ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జయరాజ్‌ నివాసాలు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు భూపాలపల్లి, హైదరాబాద్‌లోని జయరాజ్‌ నివాసాలతో పాటు తాండూరు, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తులు, వాటి విలువ తదితర వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.