Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

లచ్చగూడెంకు రూ.37.75 కోట్ల ‘అభివృద్ధి’ వరం!

Author MANA VISHWAM | 30 Aug 2026, 11:03 PM | ఖమ్మం
లచ్చగూడెంకు రూ.37.75 కోట్ల ‘అభివృద్ధి’ వరం!

మధిర, ఆగస్టు 30 (మన విశ్వం): ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లచ్చగూడెంలో విద్య, వైద్యం, రహదారి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.37.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. చింతకాని మండలం లచ్చగూడెంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రధానంగా రూ.29 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. రూ.7 కోట్లతో చింతకాని–వందనం ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి లచ్చగూడెం–నేరడ పీఆర్‌ రోడ్డు వరకు బీటీ రహదారి నిర్మించనున్నారు. మరో రూ.1.75 కోట్లతో లచ్చగూడెం నుంచి అనంతారం వరకు బీటీ రహదారి పనులు చేపట్టనున్నారు. వీటి ద్వారా లచ్చగూడెంతోపాటు పరిసర గ్రామాలకు మెరుగైన విద్య, వైద్య, రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.


ఇందిరమ్మ ఇళ్లలో.. ఆత్మీయ పలకరింపు

అనంతరం లచ్చగూడెంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. కొత్త ఇంటిలో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయడంతోపాటు విద్య, వైద్యం, రహదారులు వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి