Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

చిన్నారెడ్డిపై వేటు!

Author MANA VISHWAM | 03 Sep 2026, 02:31 PM | హైదరాబాద్
చిన్నారెడ్డిపై వేటు!

ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగింపు

నియామక ఉత్తర్వులను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

చిన్నారెడ్డిపై వేటు! - Additional Image

తక్షణమే అమల్లోకి వస్తుందంటూ జీవో 1287 జారీ

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌లో తాజా పరిణామాల వేళ కీలక నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (మన విశ్వం): తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకానికి సంబంధించి 2024 ఫిబ్రవరి 24న జారీ చేసిన జీవో ఆర్‌టీ నం.59ను రద్దు చేస్తూ బుధవారం జీవో ఆర్‌టీ నం.1287 జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే చిన్నారెడ్డి తొలగింపునకు కారణాన్ని జీవోలో పేర్కొనలేదు. కాంగ్రెస్‌లో తాజా అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.