Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు గోపాల్‌పేట్‌ విద్యార్థులు

Author MANA VISHWAM | 01 Oct 2026, 05:13 PM | కామారెడ్డి
రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు గోపాల్‌పేట్‌ విద్యార్థులు

నాగిరెడ్డిపేట, అక్టోబర్‌ 1 (మన విశ్వం): నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బిక్కనూరులో నిర్వహించిన ఎంపిక పోటీల్లో గోపాల్‌పేట్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీడీ సబ్బత్‌ కృష్ణ తెలిపారు. అండర్‌–16 విభాగంలో నందిని, భవాని, మనోహర్‌, అండర్‌–19లో విష్ణువర్ధన్‌, సాకేత్‌, మిథున, మానుశ్రీ ఎంపికైనట్లు పేర్కొన్నారు.
బాలికల రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్‌ 10, 11, 12 తేదీల్లో ఆసిఫాబాద్‌లో, బాలుర పోటీలు 13, 14, 15 తేదీల్లో సామిర్‌పేట్‌లో జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పీడీ సబ్బత్‌ కృష్ణతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.