Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

చెట్ల నరికివేత అడ్డుకున్న అధికారులపై దాడి!

Author MANA VISHWAM | 01 Oct 2026, 10:23 PM | తాజా వార్తలు
చెట్ల నరికివేత అడ్డుకున్న అధికారులపై దాడి!

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 1 (మన విశ్వం): అక్రమంగా చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులపై దాడి జరిగిన ఘటన హాజీపూర్‌ తండా సమీపంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో చెట్లను అక్రమంగా నరికివేస్తున్నట్లు సమాచారం అందడంతో సెప్టెంబర్‌ 30న రాత్రి సుమారు 8 గంటలకు ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు నాయకోటి శ్రీనివాస్‌, ప్రదీప్‌ అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో హాజీపూర్‌ తండాకు చెందిన గంగారం, చందుతో పాటు మరికొందరు తమ విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఘటనపై ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.