Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

Author MANA VISHWAM | 05 Jun 2026, 12:02 PM | TELANGANA
భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్క్‌లో హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజుల పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవ్వరూ అనుకోవద్దని తెలిపారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని.. ఈరోజు కూడా అది జ్ఞాపకం చేసుకుంటామని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని కోరారు.ఢిల్లీ కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. EV వాహనాల వాడకం వల్ల పొల్యూషన్‌ను తగ్గించి పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని.. అందరూ నీటిని ఆదా చేయాలని సూచించారు. బోర్లు వేస్తే నీరు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకోవాలని కోరారు. ప్లాస్టిక్‌ను నియంత్రించాలని అన్నారు. భూమిలో కలిసి పోయే వ్యర్థాలను వాడితే మంచిదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.