Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఏఐతో టెకీలకు జాబ్స్ పెరుగుతున్నాయ్: ఎన్‌విడియా సీఈఓ

Author MANA VISHWAM | 05 Jun 2026, 12:23 PM | Technology
ఏఐతో టెకీలకు జాబ్స్ పెరుగుతున్నాయ్: ఎన్‌విడియా సీఈఓ

ఏఐ సాంకేతికతతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తగ్గుతున్నాయన్న వాదనను ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తోసిపుచ్చారు. ఇది అర్థరహిత వాదన అని కొట్టిపారేశారు. తైపీలో (తైవాన్) జరిగిన‌ కంప్యూటెక్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏఐ కారణంగా ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతోందని చెప్పారు. టెకీలకు, ఇంజనీర్లకు ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు.‘ఏఐ వల్ల టెకీలకు జాబ్స్ పెరుగుతున్నాయి. ఇందుకు చాలా సింపుల్ కారణం ఉంది. ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉత్పాదకత భారీగా పెరుగుతోంది. ఒక ఉద్యోగి ఉత్పాదకత పెరిగితే సంస్థలు మరింత మంది ఇంజినీర్లను నియమించుకోవడం సహజం’ అని హువాంగ్ పేర్కొన్నారు.అయితే, ఏఐ రాక వల్ల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గాయన్న భావన బలపడుతున్న విషయం తెలిసిందే. పలు అంతర్జాతీయ కంపెనీల్లో లేఆఫ్స్‌కు, ఏఐకి సంబంధం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని సంస్థలు లేఆఫ్స్ సమయంలో ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఎన్‌విడియా సీఈఓ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.