Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

'ఆల్ఫా’ ట్రైలర్ విడుదల.. యాక్షన్ మోడ్‌లో అదరగొట్టిన ఆలియా భట్

Author MANA VISHWAM | 17 Jun 2026, 03:37 PM | Cinema
'ఆల్ఫా’ ట్రైలర్ విడుదల.. యాక్షన్ మోడ్‌లో అదరగొట్టిన ఆలియా భట్

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆల్ఫా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన వెంటనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో అలియా భట్ , షార్వారి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, బాబీ దెవొల్ , అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తోంది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో తొలి మహిళా కేంద్రిత గూఢచారి యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ‘ఆల్ఫా’ కథ భారత భద్రత కోసం పనిచేసే ప్రత్యేక రహస్య విభాగం చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్‌లో దేశ రక్షణ కోసం సిద్ధమవుతున్న మహిళా ఏజెంట్ల శిక్షణ, ప్రమాదకర ఆపరేషన్లు, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఘట్టాలను ఆకట్టుకునేలా చూపించారు.
ప్రత్యేకంగా ఆలియా భట్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆమెతో పాటు శర్వరీ కూడా శక్తివంతమైన పాత్రలో మెరిసింది. ఇద్దరూ కలిసి చేసిన స్టంట్ సన్నివేశాలు, ఛేజ్ సీక్వెన్స్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ ఫైట్లు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ నిర్మాణ విలువలు, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. నేపథ్య సంగీతం, విజువల్స్, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తున్నాయి.
నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ‘ఆల్ఫా’ చిత్రం 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌కు లభిస్తున్న విశేష స్పందనను బట్టి చూస్తే, ఈ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.