Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

కేటీఆర్ ఓ 'ట్విట్టర్ టిల్లు'.. సవాల్ స్వీకరించే దమ్ములేని డ్రామారావు: మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు

Author MANA VISHWAM | 18 Jun 2026, 03:43 PM | TELANGANA
కేటీఆర్ ఓ 'ట్విట్టర్ టిల్లు'.. సవాల్ స్వీకరించే దమ్ములేని డ్రామారావు: మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు

"ట్విట్టర్ టిల్లు.. చెప్తడు అబద్దాల సొల్లు.. అన్నట్టుగా ఉంది కేటీఆర్ వ్యవహారం. సవాల్ స్వీకరించే దమ్ము లేక ఆయన డ్రామాలు ఆడుతున్నారు" అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ పాలేరులో పట్టపగలే అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తన ఫేస్ బుక్ పేజీలో మండిపడ్డారు.

​పదేండ్ల ఫ్లాప్ షో.. రెండేండ్ల టాప్ షో!

​పదేండ్లు అధికారంలో ఉండి పేదలకు ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పలేని కేటీఆర్ , కేవలం రెండున్నరేండ్లలోనే లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మంత్రి అన్నారు.
​"అవినీతికి అంబాసిడర్లు మీరు. కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్, ఈ-కార్ రేస్ స్కామ్, గొర్రెల పంపిణీ స్కామ్, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ధరణి పేరుతో పేదల భూములు కొల్లగొట్టిన మీరా మా గురించి మాట్లాడేది?" అని పొంగులేటి నిలదీశారు.

​గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు..

ఇవి కూడా చదవండి

​ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసమే వాడుకుందని పొంగులేటి ఆరోపించారు. పదేండ్ల పాలనలో ఒక్క గిరిజన తండాలోనైనా ఒక్క ఇల్లయినా కట్టి ఇచ్చారా? అని ప్రశ్నించారు.
​కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏండ్లలోనే గిరిజన ప్రాంతాలున్న నియోజకవర్గాలకు మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిందని, దానికి అదనంగా మరో 1,500 ఇండ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. గిరిజన గూడాల్లోని గుడిసెలను పక్కా ఇండ్లుగా మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని స్పష్టం చేశారు.

​కేటీఆర్‌కు పొంగులేటి బహిరంగ సవాల్

​ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో కూడా, బీఆర్ఎస్ పదేండ్లలో నిర్మించిన ఇండ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఇండ్లు నిర్మిస్తుందని
​ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఇండ్లు నిర్మిస్తే.. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, మరి కేటీఆర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా తప్పుకుంటానని చెప్పగలరా? అని సవాల్ విసిరారు.

​గ్రామీణ, నగర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల జోరు

​గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పదేండ్లలో నిర్మించిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే ఎక్కువ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందని మంత్రి వివరించారు. అలాగే హైదరాబాద్‌లో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఇండ్లు నిర్మించి ప్రజలకు మేలు చేస్తుందనే నిజం కేటీఆర్‌కు కూడా తెలుసు కాబట్టే, ఆయన తన సవాల్‌ను స్వీకరించేందుకు ముందుకు రావడం లేదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు.