Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నిరంజన్‌కు బండ్ల గణేష్ భారీ ఆర్థిక సాయం: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రూ. 5 లక్షల చెక్ అందజేత!

Author MANA VISHWAM | 20 Jun 2026, 12:10 PM | హన్మకొండ
నిరంజన్‌కు బండ్ల గణేష్ భారీ ఆర్థిక సాయం: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రూ. 5 లక్షల చెక్ అందజేత!

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన బాలుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. గతంలో ప్రకటించిన విధంగానే శనివారం హనుమకొండ, హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి బండ్ల గణేష్ స్వయంగా వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు ధైర్యం చెప్పి, తమ 'పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్' తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు.

​నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా...

​ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
​"నా దేవుడు, దైవసమానులైన పవన్ కళ్యాణ్ గారి పరామర్శ వల్లే నిరంజన్ విషయం నా దృష్టికి వచ్చింది. ఆయన భక్తుడిగా, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ రోజు ఈ సహాయం చేస్తున్నాను. మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కళ్యాణ్ గారి దయే కారణం. ప్రస్తుతం నా కూతురి పెళ్లి పనుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ రోజు హనుమకొండకు వచ్చి బాలుడిని కలవాలని నిర్ణయించుకున్నాను. నిరంజన్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— బండ్ల గణేష్, చిత్ర నిర్మాత

ఇవి కూడా చదవండి

​హర్షం వ్యక్తం చేస్తున్న హనుమకొండ ప్రజలు

​సొంత ఇంట్లో కూతురి పెళ్లి పనులు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పక్కన పెట్టి ఓ పవన్ కళ్యాణ్ అభిమాని పిలుపునకు స్పందించి హనుమకొండకు విచ్చేసిన బండ్ల గణేష్‌పై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిరంజన్ కుటుంబానికి ఆయన చేసిన ఈ భారీ ఆర్థిక సాయం పట్ల హనుమకొండ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.