Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

"వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి సినిమా చూపిస్తా" హన్మకొండ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Author MANA VISHWAM | 22 Jun 2026, 02:47 PM | హన్మకొండ
"వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి సినిమా చూపిస్తా" హన్మకొండ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి సినిమా చూపిస్తా"
హన్మకొండ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

​హన్మకొండ /వర్ధన్నపేట(మన విశ్వం )
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నేను కెసిఆర్ అంత మంచోణ్ని కాదు "వచ్చే ఐదేళ్ల పాటు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రతి అడుగులోనూ వారి వైఫల్యాలను ఎండగడతాం" అని కేటీఆర్ హెచ్చరించారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు ఉద్యోగ విరమణ చేసినా, ఇక్కడి నుంచి పారిపోయినా, చివరకు సప్త సముద్రాలు దాటి వెళ్లినా సరే... లాక్కొచ్చి మరీ బోనులో నిలబెడతాం" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అక్రమ రౌడీయిజానికి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బందులకు గురిచేసిన అధికారులను, నాయకులను భవిష్యత్తులో వదిలేది లేదని తేల్చి చెప్పారు."కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు.అధికార గర్వంతో విర్రవీగుతున్న వారికి కాలమే సమాధానం చెప్తుంది. వచ్చే ఐదేళ్లు అసలైన సినిమా చూపిస్తాం "అని అన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ తోపాటు నియోజకవర్గ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా, రాజకీయంగా ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

"వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి సినిమా చూపిస్తా" హన్మకొండ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు - Additional Image