Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పేరు పెట్టు.. లక్ష కొట్టు: తెలంగాణ హౌజింగ్ బోర్డు బంపర్ ఆఫర్! ​

Author MANA VISHWAM | 23 Jun 2026, 03:56 PM | Trending
పేరు పెట్టు.. లక్ష కొట్టు: తెలంగాణ హౌజింగ్ బోర్డు బంపర్ ఆఫర్! ​

సొంతింటి కల నిజం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న సామాన్యులకు తెలంగాణ హౌజింగ్ బోర్డు సరికొత్త శుభవార్త అందించింది. హైదరాబాద్ పరిధిలో భారీ ఎత్తున లక్ష ప్లాట్ల నిర్మాణానికి బోర్డు కసరత్తులు ప్రారంభించింది. అయితే, ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ సరికొత్త హౌజింగ్ స్కీమ్‌కు ఒక మంచి పేరును సూచించే బాధ్యతను ప్రజలకే అప్పగించింది. పేరు పెట్టండి.. "లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకోండి " అంటూ తెలంగాణ హౌజింగ్ బోర్డు ఒక సూపర్ కాంటెస్ట్‌ను అనౌన్స్ చేసింది.
ప్రజల నుండి వచ్చే సూచనలలో అత్యంత ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉండే ఉత్తమ పేరును హౌజింగ్ బోర్డు ఎంపిక చేస్తుంది. విజేతకు రూ. 1లక్ష నగదు బహుమతిగా అందజేస్తారు.
​ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ లోపు తమ పేర్లను సూచించాల్సి ఉంటుంది.
​తెలంగాణ హౌజింగ్ బోర్డు అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీని సందర్శించి ఈ పోటీలో పాల్గొనవచ్చని బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
​హైదరాబాద్ వాసులకు ఇళ్ల స్థలాలను అందించే ఈ మెగా ప్రాజెక్టుకు మీ సృజనాత్మకతతో ఒక చక్కటి పేరును ఆలోచించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి లక్ష రూపాయలు గెలుచుకునే ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు!