Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల కేసులు రద్దు

Author MANA VISHWAM | 24 Jun 2026, 10:51 PM | హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల కేసులు రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై నమోదైన ఐదు కేసులను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
​గత హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండానే సభలు నిర్వహించారనేది ఈ కేసుల ప్రధాన సారాంశం. అయితే, ఈ కేసుల్లో చట్టపరమైన నిలకడ లేదని పేర్కొంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి చేసుకున్న న్యాయస్థానం.. జూన్ 18న తీర్పును రిజర్వ్ చేసి, బుధవారం కేసులను కొట్టివేస్తూ తుది ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముఖ్యమంత్రిపై ఉన్న ఒక దీర్ఘకాలిక న్యాయపరమైన చిక్కు ముగిసినట్లయింది