Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలకం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

Author MANA VISHWAM | 26 Jun 2026, 03:26 PM | Crime
​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలకం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

​ఘనంగా ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ '2కే రన్'

​హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్

​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలకం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ - Additional Image


మాదకద్రవ్యాల మహమ్మారి లేని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత, విద్యార్థులు సైనికుల్లా ముందుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ‘2కే రన్’ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు సాగిన ఈ పరుగును సీపీ సన్‌ప్రీత్ సింగ్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో ట్రైసిటీ పరిధిలోని వేలాది మంది యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరుగులో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికేట్లు అందజేశారు.

​క్షణికానందానికి జీవితాలను అంధకారం చేసుకోవద్దు

​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలకం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ - Additional Image

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ మహమ్మారి పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
​"క్షణికానందం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులై జీవితాలను అంధకారం చేసుకోవద్దు. విద్యార్థులు కేవలం చదువు, ఉన్నత లక్ష్యాల సాధనపైనే దృష్టి పెట్టాలి. డ్రగ్స్ విక్రయాలు, వినియోగానికి పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు." అని సిపి సన్ ప్రీత్ సింగ్ annaru


​చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

ఇవి కూడా చదవండి

​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలకం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ - Additional Image

​పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఇతరులను కూడా చైతన్యపరచాలని కోరారు.

​డ్రగ్స్ నియంత్రణకు 'ఈగల్ ఫోర్స్'.. సమాచారం ఇవ్వండి

​వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా 'ఈగల్ ఫోర్స్' విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా మాదకద్రవ్యాలను విక్రయించినా, వినియోగించినా తక్షణమే 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

​తల్లుల వేదన వర్ణనాతీతం

​హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత మత్తుకు బానిసలైతే ఆ కుటుంబాలు, ముఖ్యంగా కన్నతల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు.

​"ఐయామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్"

​కార్యక్రమం ముగింపులో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సైనికుల్లా పనిచేస్తామని యువత, విద్యార్థులచే అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన “ఐయామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్” సెల్ఫీ పాయింట్ వద్ద ముఖ్య అతిథులు ఫొటోలు దిగి యువతలో స్ఫూర్తి నింపారు.​ఈ వినూత్న కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, టీజీ ఎన్‌పీడీసీఎల్ ఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్యశారద, చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యతో పాటు పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.