Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​గాంధీ ఆస్పత్రిలో వీహెచ్‌ను పరామర్శించిన జానారెడ్డి

Author MANA VISHWAM | 04 Jul 2026, 10:52 PM | TELANGANA
​గాంధీ ఆస్పత్రిలో వీహెచ్‌ను పరామర్శించిన జానారెడ్డి

ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష


ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్)ను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి శనివారం గాంధీ ఆస్పత్రిలో పరామర్శించారు. డాక్టర్ పూర్ణచందర్ రెడ్డితో కలిసి వెళ్లిన ఆయన, వీహెచ్ ఆరోగ్య పరిస్థితిని మరియు వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

​వీహెచ్ కుటుంబ సభ్యులను కలిసిన జానారెడ్డి వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనల ప్రకారం చికిత్స కొనసాగించాలని, వీహెచ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాబాహుళ్యంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
​డాక్టర్ పూర్ణచందర్ రెడ్డి సైతం వీహెచ్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలను అభినందిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రజా జీవితంలో, రాజకీయాల్లో వీహెచ్ అందించిన సుదీర్ఘ సేవలను జానారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర విశేషమైనదని కొనియాడారు.
​వీహెచ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని వారంతా ఆకాంక్షించారు.