Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

'భూభారతి'లో మహా దోపిడీ.. రాష్ట్రంలో తుగ్లక్ పాలన!

Author MANA VISHWAM | 05 Jul 2026, 10:36 AM | TELANGANA
'భూభారతి'లో మహా దోపిడీ.. రాష్ట్రంలో తుగ్లక్ పాలన!

ధరణిని ముంచి.. 'భూభారతి'తో కోటి ఎకరాలు నిషేధిత జాబితాలోకి!

​దరఖాస్తుల్లేకుండానే 4,500 అప్లికేషన్ల ఆమోదం.. దీని వెనుక ఉన్నదెవరు?

​ సీఎం రేవంత్‌కు పరిపాలన చేతకాదు.. 20 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ దందాయే వచ్చు!

​ రెవెన్యూ మంత్రి పొంగులేటి తన కన్‌స్ట్రక్షన్ వ్యాపారాల్లో బిజీ: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర ఆరోపణలు


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ పోర్టల్ అక్రమాలకు అడ్డాగా మారిందని, రాష్ట్రంలో భూములను దోచుకోవడానికే ఈ కొత్త వ్యవస్థను తెచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని, "భూభారతిలో దొంగలు పడ్డారు.. ఆ దొంగలు ప్రభుత్వమా, ప్రజాప్రతినిధులా, అధికారులా లేక ఏవైనా అతీత శక్తులా?" అని ఆయన ప్రశ్నించారు.

​దరఖాస్తుల్లేకుండానే 4,500 అప్రూవల్స్!

​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, పటిష్టంగా తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ వల్ల భూ అక్రమాలు తగ్గి, ఎవరి భూమి వారి వద్ద సురక్షితంగా ఉండేదని గాదరి కిషోర్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని పక్కనబెట్టి ‘భూభారతి’ పేరుతో పెద్ద స్కామ్‌కు తెరలేపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం ఎవరూ దరఖాస్తులు కూడా చేసుకోకపోయినా.. ఎవరికీ సంబంధం లేకుండానే రాత్రికి రాత్రే 4,500 అప్లికేషన్లు ఎలా అప్రూవ్ అయిపోయాయని ఆయన నిలదీశారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

​కోటి ఎకరాలు ప్రోహిబిటెడ్ లిస్టులోకి..

​భూభారతి పోర్టల్ వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి ఎకరాల భూమిని నిషేధిత (ప్రోహిబిటెడ్) జాబితాలో పెట్టారని కిషోర్ ఆరోపించారు. రైతులను ఇబ్బందుల్లోకి నెట్టి, ఆ భూములను లాక్కోవడానికే ఈ కుట్ర జరుగుతోందన్నారు. ఒకవైపు భూభారతిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం తన సొంత కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, దందాల బిజీలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.


​20 ఏళ్ల ప్రస్థానంలో రియల్ ఎస్టేట్ దందాయే వచ్చు!


​"రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్కసారి కూడా అధికార పార్టీలో పని చేయలేదు. అందుకే ఆయనకు పరిపాలన మీద కనీస అవగాహన లేదు. గతంలో ఆయన చేసింది రియల్ ఎస్టేట్ దందానే.. అందుకే ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చుని కూడా అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు" అని గాదరి కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై ప్రజల్లో రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయని దుయ్యబట్టారు.


​రేవంత్ రెడ్డి గారూ.. హిట్లర్‌లా ఆత్మహత్య చేసుకోకండి!

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు హిట్లర్ నైజాన్ని తలపిస్తోందని కిషోర్ విమర్శించారు. "హిట్లర్ నాడు పిచ్చి పిచ్చి పనులు చేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు.. దయచేసి మీరు అలాంటి పనులు చేయకండి. రేవంత్ రెడ్డి ఇతరుల చావును కోరుకోవచ్చు, కానీ మేము ఆయనలా అనుకోం.. ఆయన బాగుండాలనే కోరుకుంటాం" అని హితవు పలికారు.

​'గాంధీ భవన్' బార్ అయిపోయింది..

​టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై కూడా గాదరి కిషోర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే స్వయంగా గాంధీ భవన్ ఒక బార్‌లా మారిపోయిందని అంటున్నారని, అలాంటి చోట ఉండే ‘బీర్ బాటిళ్ల’ మహేష్ కుమార్ గౌడ్ మాటలను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూభారతి అక్రమాలపై సమాధానం చెప్పాలని, రైతుల భూములతో చెలగాటమాడటం ఆపాలని కిషోర్ డిమాండ్ చేశారు.