Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

క్షుద్రపూజల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్

Author MANA VISHWAM | 04 Aug 2026, 09:46 PM | హైదరాబాద్
క్షుద్రపూజల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్

హరీశ్‌రావుపై ఆరోపణలు నిరాధారమని ధ్వజం

దేవాలయాలను అవమానించొద్దని సూచన

చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ఆగస్టు 4 (మన విశ్వం): మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్క్రిప్ట్ ఉందని విమర్శించారు.
హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా వివిధ దేవాలయాలను సందర్శించి పూజలు చేయడాన్ని క్షుద్రపూజలుగా చిత్రీకరించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. దేవాలయాలు, అఘోర సంప్రదాయం, ముఖాంబిక అమ్మవారు, రంగనాథస్వామి వంటి ఆధ్యాత్మిక విశ్వాసాలను కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ప్రకారం దేశంలో ఎక్కడైనా సంచరించే హక్కు, ఆర్టికల్-25 ప్రకారం నచ్చిన మతాన్ని ఆచరించి పూజలు చేసే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేశారు. ఎవరు ఏ దేవాలయానికి వెళ్లారో గమనించి రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు శాస్త్రీయ దృక్పథాన్ని విస్మరించి మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వర్షాలు క్షుద్రపూజల వల్ల కురవవని, ప్రకృతి చక్రం ప్రకారమే కురుస్తాయని పేర్కొంటూ హైడ్రాలజీ ప్రక్రియను ఉదాహరణగా వివరించారు.
హరీశ్‌రావు ప్రాణహిత, గోదావరి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కోసం కృషి చేశారని, ఆయనపై అసత్య ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని అన్నారు. సింగరేణి, జైపూర్ పవర్ ప్లాంట్, సివిల్ సప్లైస్, గురుకుల టెండర్లు, పీజీ మెడికల్ సీట్లు, నాదర్‌గుల్ భూముల వంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ 52 రోజుల పాటు ఎక్కడ ఉన్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. అలాగే రూ.200 కోట్లతో నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాస గృహప్రవేశాన్ని అర్థరాత్రి ఎందుకు నిర్వహించారో కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హరీశ్‌రావుకు పంపిన లీగల్ నోటీసులపై ఆధారాలు ఉంటే కాంగ్రెస్ నాయకులు చట్టపరంగా సమాధానం ఇవ్వాలని, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. ఆరోపణలకు బదులుగా బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.