Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

'ది ప్యారడైజ్' టీజర్‌ విడుదల.. నాని మాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!

Author MANA VISHWAM | 06 Aug 2026, 06:53 PM | Cinema

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని సరసన కాయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
తాజాగా 'ది ప్యారడైజ్' టీజర్ను విడుదల చేయగా, సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌లో నాని ఇప్పటివరకు కనిపించని పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. రా అండ్ రగ్గడ్ స్టైల్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ప్రత్యేకంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసింది. ఇక చేతినిండా బ్లేడ్లు పట్టుకుని నాని చెప్పిన "దిష్టంతా పోవాలే!" అనే డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచి అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. నాని ఆగ్రహావేశం, యాక్షన్ ఎలివేషన్స్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, 'ది ప్యారడైజ్' చిత్రం వచ్చే నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.