Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నీటి హక్కులకు భంగమైతే.. జల ఉద్యమమే

Author MANA VISHWAM | 08 Aug 2026, 09:06 PM | హైదరాబాద్
నీటి హక్కులకు భంగమైతే.. జల ఉద్యమమే

జీఆర్ఎంబీ ఎజెండాపై ప్రభుత్వం వైఖరి చెప్పాలి

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోం

హిల్ట్ పాలసీని అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరిక

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణ నదీ జలాల హక్కులకు భంగం కలిగితే రాష్ట్రవ్యాప్తంగా మరో జల ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కులకంటే తమ పార్టీకి ముఖ్యమైన అంశం మరొకటి లేదన్నారు. వచ్చేవారం జరగనున్న జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం నందినగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జీఆర్ఎంబీ ఎజెండా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని కేటీఆర్ ఆరోపించారు. అలాంటి సమావేశానికి ప్రభుత్వం ఎలా హాజరవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగే పరిస్థితి ఉంటే సమావేశాన్ని బహిష్కరించాలన్నారు. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ నీటి వాటాకు అన్యాయం చేస్తే మరో భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
పక్క రాష్ట్రం నదీ జలాలను వినియోగించుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడం లేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఒత్తిడి తెస్తే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు.


హిల్ట్ పాలసీపై పోరాటం

హైదరాబాద్‌లోని విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం కలిగించేలా హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ పాలసీ కింద భూములు రెగ్యులరైజ్ చేయించుకునే సంస్థలు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిపై పారిశ్రామిక సంస్థలకు లేఖలు రాయడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
హైడ్రా చర్యలు, 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపైనా కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల ఆస్తులకు నష్టం కలిగించే నిర్ణయాలపై న్యాయపోరాటంతోపాటు ప్రజాక్షేత్రంలోనూ పోరాడతామని స్పష్టం చేశారు.