Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పెట్టుబడులకు రండి.. తెలంగాణతో కలిసి ఎదగండి

Author MANA VISHWAM | 08 Aug 2026, 09:13 PM |
పెట్టుబడులకు రండి.. తెలంగాణతో కలిసి ఎదగండి

3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

పారిశ్రామిక భూమి.. నైపుణ్య యువత.. 24 గంటల విద్యుత్‌ సిద్ధం

అనుమతులకు సింగిల్‌ విండో.. ఫ్యూచర్‌ సిటీపై ప్రత్యేక దృష్టి

శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలు, ప్రవాసులకు భట్టి విక్రమార్క పిలుపు

డ్రైవర్‌లెస్‌ కారులో ప్రయాణం.. హైదరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుపై ఆరా

ఇవి కూడా చదవండి

పెట్టుబడులకు తెలంగాణ అపార అవకాశాల గని అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పారిశ్రామిక భూములు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్‌, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు ప్రధాన బలాలని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో భట్టి సమావేశమయ్యారు. ‘‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కండి’’ అని పిలుపునిచ్చారు.


పరిశ్రమలకు అన్నీ సిద్ధం

తయారీ, ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, క్లీన్‌ ఎనర్జీ రంగాలకు పారిశ్రామిక కారిడార్లు, పార్కుల్లో అవసరమైన భూములను అందుబాటులో ఉంచుతున్నామని భట్టి తెలిపారు. పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ అందించే సామర్థ్యం రాష్ట్రానికి ఉందన్నారు. పెట్టుబడిదారులకు అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య యువతను తీర్చిదిద్దేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు విద్యా, సాంకేతిక సంస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు.


ఫ్యూచర్‌ సిటీ.. పెట్టుబడులకు కొత్త చిరునామా

అత్యాధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికతో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని భట్టి చెప్పారు. ఐటీ, ఫార్మా, గ్రీన్‌ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, విజ్ఞాన ఆధారిత పరిశ్రమలను ఆకర్షించడంలో ఇది కీలక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రవాస తెలంగాణవాసులు పెట్టుబడులతోనే కాకుండా సాంకేతికత, ఆవిష్కరణలతోనూ రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని కోరారు.


డ్రైవర్‌ లేకుండానే భట్టి రయ్‌.. రయ్‌!
అమెరికా పర్యటనలో భట్టి విక్రమార్క శాన్‌ఫ్రాన్సిస్కోలో వేమో డ్రైవర్‌లెస్‌ కారులో ప్రయాణించారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో సమావేశమై స్వయంచాలక వాహనాల సాంకేతికతపై ఆరా తీశారు. హైదరాబాద్‌, ఫ్యూచర్‌ సిటీలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ తరహా రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశాలపై చర్చించారు.
హై-రిజల్యూషన్‌ మ్యాపింగ్‌, సెన్సర్లకు అనుకూలమైన రహదారులు, ప్రత్యేక టెస్టింగ్‌ కారిడార్లు, డేటా కనెక్టివిటీ, ఏఐ కంప్యూటింగ్‌ మౌలిక వసతులు, నియంత్రణ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్‌ రవాణా సాంకేతికతల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపే అవకాశాలను పరిశీలించాలని భట్టి పేర్కొన్నారు.