Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘కూతురు వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?’

Author MANA VISHWAM | 20 Aug 2026, 05:44 PM | హైదరాబాద్
‘కూతురు వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?’

తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి తన వివరణ అందజేశారు.
ఆగస్టు 19న తన జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారని సురేఖ తెలిపారు. తన స్వస్థలమైన గీసుగొండతో ఉన్న అనుబంధంతో అక్కడ నిర్వహించిన వేడుకలకు తన కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరైందని పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలేనని వివరించారు.


‘కుటుంబ బంధంతో బాధ్యత మోపడం సరికాదు’

‘కూతురు వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?’ - Additional Image

కుటుంబ బాంధవ్యం ఉన్నంత మాత్రాన ఒకరి రాజకీయ అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సమంజసం కాదని సురేఖ పేర్కొన్నారు. తన ప్రమేయం లేని వ్యాఖ్యలపై తనను వివరణ కోరడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేశారు. వాస్తవాలు, ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని కోరారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీని సురేఖ కోరారు.

ఇవి కూడా చదవండి