Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తంగేడు మొక్కలు నాటిన జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు

Author MANA VISHWAM | 05 Jun 2026, 07:54 PM | TELANGANA, సిద్దిపేట
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తంగేడు మొక్కలు నాటిన జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు

సిద్ధిపేట, జూన్ 5:

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ హెచ్ ఆర్ సి సిద్ధిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగదేవత ఆలయం మరియు కొండ మైసమ్మ ఆలయ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర పుష్ప చిహ్నమైన తంగేడు పూల మొక్కలను నాటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తంగేడు పువ్వు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ముఖ్యంగా బతుకమ్మ పండుగలో తంగేడు పూలకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు. తంగేడు మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యాన్ని పెంపొందించటంలో మరియు ప్రకృతికి అందాన్ని చేకూర్చటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరితమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. "ఒక్క మొక్క – వెయ్యి ప్రాణాలకు ఆధారం", "చెట్లను నాటుదాం – ప్రకృతిని కాపాడుదాం" అనే సందేశాలతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తంగేడు పూల ప్రాముఖ్యతను వివరించి, తెలంగాణ పచ్చదనాన్ని మరింత విస్తరింపజేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి సిద్ధిపేట జిల్లా కమిటీ సభ్యులు సంపత్ ,కార్తీక్ రెడ్డి, రాములు ప్రభు రాజ్ మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.