Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘నీట్’ రీ-ఎగ్జామ్ -ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

Author MANA VISHWAM | 20 Jun 2026, 11:20 PM | హైదరాబాద్
‘నీట్’ రీ-ఎగ్జామ్ -ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా రేపు (ఆదివారం) జరగనున్న 'నీట్' (NEET) రీ-ఎగ్జామ్ ఒత్తిడిని తట్టుకోలేక ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
​పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
​ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాఫర్ హుసేన్ ప్రస్తుతం కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్, మియాపూర్ కల్వరీ టెంపుల్ సమీపంలో నివాసముంటోంది. జాఫర్ కుమార్తె సనా (19) వైద్యురాలు కావాలనే లక్ష్యంతో 'నీట్' పరీక్ష కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది.

​ఘటన ఎలా జరిగిందంటే..?

​నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల వల్ల రద్దు కావడంతో, జూన్ 21న (ఆదివారం) నిర్వహించనున్న రీ-ఎగ్జామ్‌కు సనా సిద్ధమవుతోంది. అయితే, పరీక్ష సమయం దగ్గరపడుతుండటంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం (జూన్ 20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సనా తన గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇవి కూడా చదవండి

​ఆఖరి లేఖలో ఏముందంటే..

"నా మరణానికి ఎవరూ కారణం కాదు. కుటుంబ సభ్యులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను అందుకోలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా" అని రాసిన సూసైడ్ నోట్ ఘటనా స్థలంలో లభ్యమైంది.

​పోలీసుల దర్యాప్తు – కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

​సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
​తెల్లారితే పరీక్ష రాసి డాక్టర్ అవుతుందనుకున్న కూతురు, పరీక్ష ఒత్తిడి భరించలేక ఇలా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.