Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​మిడ్జిల్ నాటిన మొక్క... నేడు మహావృక్షమైంది!

Author MANA VISHWAM | 05 Jul 2026, 10:32 AM | Politics
​మిడ్జిల్ నాటిన మొక్క... నేడు మహావృక్షమైంది!

​నాటి జెడ్పీటీసీ నమ్మకమే.. నేటి సీఎం పీఠం: కృతజ్ఞత సభలో రేవంత్ రెడ్డి భావోద్వేగం

​ఆనాడు నన్ను గుండెలకు హత్తుకున్నారు.. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాలని భట్టికి విజ్ఞప్తి

​దొరల దురహంకారాన్ని మళ్లీ బొందపెట్టాలి.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లపై ముఖ్యమంత్రి నిప్పులు


"ఆనాడు మిడ్జిల్ మండల ప్రజలు నాటిన చిన్న మొక్క.. ఇవాళ మహావృక్షమైంది. నా 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కీలకమైన ఈ ప్రాంత ప్రజల నమ్మకమే ఇవాళ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది" అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‌లో శనివారం నిర్వహించిన భారీ 'కృతజ్ఞత సభ'లో సీఎం ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 2006 జూలై 4న మిడ్జిల్ ప్రజలు తనను తొలిసారిగా ఆశీర్వదించిన రోజును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

​పరాయివాడినైనా గుండెల్లో పెట్టుకున్నారు!

​"మిడ్జిల్, కల్వకుర్తి ప్రాంతాలకు గతంలో బూర్గుల రామకృష్ణారావు, జైపాల్ రెడ్డి లాంటి ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించారు. 2006లో నేను జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు.. ఈ నియోజకవర్గానికి చెందని వాడినైనా ఇక్కడి ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు. ఆ నమ్మకమే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. గతంలో 'డార్క్ మండలాలు'గా ఉన్న ఈ ప్రాంతాల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నా."
— రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

​దేశానికే దిక్సూచిగా కులగణన

​తాను ఏనాడూ పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని సీఎం స్పష్టం చేశారు. దేశంలో వందేళ్లుగా జరగని సామాజిక కులగణనను తెలంగాణలో చేపట్టి దేశానికే దిక్సూచిగా నిలిచామని గర్వంగా ప్రకటించారు. ఇదే సమయంలో గత పాలకుల తీరుపై మండిపడుతూ.. "రాష్ట్రంలో దొరల దురహంకారాన్ని మరోసారి బొందపెట్టాల్సిన అవసరం ఉంద"ని పిలుపునిచ్చారు.

​గద్దర్ అన్నను గడీల ముందు నిలబెట్టారు..

​తెలంగాణ కోసం గొంతెత్తిన ప్రజా గాయకుడు గద్దర్ అన్నను గత పాలకులు దొర గడీల ముందు గంటల కొద్దీ నిలబెట్టి అవమానించారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదని, కానీ తమ 'ప్రజాపాలన' ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదల కలలను సాకారం చేస్తున్నామని వివరించారు.

​కేసీఆర్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి?

​గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
​రూ.70 వేల కోట్ల అప్పు ఉన్న తెలంగాణను రూ.8.50 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు.కేసీఆర్ ఏ గ్రామంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారా? దళితులకు మూడెకరాల భూమి, కోటి ఎకరాలకు నీరు, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు.ఇసుక దోపిడీని అడ్డుకున్న నేరేళ్ల దళితులను లారీలతో తొక్కించిన దుర్మార్గుడు కేసీఆర్.పదేళ్లు కేసీఆర్ కుటుంబానికి, బంధువులకు తప్ప ఏ పేదవాడికైనా ఉద్యోగాలు, పదవులు వచ్చాయా?కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది? కేటీఆర్, కవిత, హరీశ్ రావులకు రూ.వేల కోట్ల విలువైన భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి?​బీఆర్‌ఎస్ కుటుంబం మళ్లీ దోపిడీలు, దొంగతనాలు మొదలు పెట్టడానికే 'ప్రజాపాలన' పోవాలని కోరుకుంటున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.