Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

'కాళేశ్వరం వైఫల్యానికి క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోండి ' కేటీఆర్ పర్యటన పై ఎమ్మెల్యే నాయిని ఫైర్

Author MANA VISHWAM | 05 Jul 2026, 12:26 PM | హన్మకొండ
 'కాళేశ్వరం వైఫల్యానికి క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోండి '  కేటీఆర్ పర్యటన పై ఎమ్మెల్యే నాయిని ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పూర్తిగా వృథా చేసిందని ఆయన ఆరోపించారు.
​ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు..

​•కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై కేటీఆర్ పర్యటనకు వెళ్లే ముందే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

​•"మీరు చేసిన తప్పులను, అవినీతిని, వైఫల్యాలను ప్రజలు మర్చిపోతారని అనుకోవడం మీ భ్రమ" అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత కుటుంబ వ్యవహారాల్లోనే వివాదాలు ఎదుర్కొంటున్న వ్యక్తి, రేపు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

​•ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి కాళేశ్వరం సందర్శనకు వెళ్లవచ్చని, కానీ అక్కడ దాగున్న నిజాలను ఎదుర్కొనే ధైర్యం కూడా కేటీఆర్‌కు ఉండాలని సవాల్ విసిరారు. చేసిన తప్పులను ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమాపణ చెబితే భగవంతుడు కూడా క్షమిస్తాడేమోనని వ్యాఖ్యానించారు.

​"కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్య బాధ్యత నుంచి బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పటికీ తప్పించుకోలేదు. తెలంగాణ ప్రజల ముందు నిజాలు ఒప్పుకుని, కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైంది." — నాయిని రాజేందర్ రెడ్డి (ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ)