Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం చెత్తబుట్టలోకి పోవడం ఖాయం: బిఆర్ఎస్ నేత దొగ్గంపూడి రంజిత్ రెడ్డి ఆగ్రహం

Author MANA VISHWAM | 05 Jul 2026, 02:38 PM | హన్మకొండ
ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం చెత్తబుట్టలోకి పోవడం ఖాయం: బిఆర్ఎస్ నేత దొగ్గంపూడి రంజిత్ రెడ్డి ఆగ్రహం

ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు

తెల్లవారుజామున అరెస్టులు ఏంటి? పోలీస్ స్టేషన్లన్నీ మా కార్యకర్తలతో నిండిపోయాయి

ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం చెత్తబుట్టలోకి పోవడం ఖాయం: బిఆర్ఎస్ నేత దొగ్గంపూడి రంజిత్ రెడ్డి ఆగ్రహం - Additional Image

మరో రెండేళ్లే ఈ ప్రభుత్వం.. పోలీసులకు మేమే అండగా ఉంటాం


బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొగ్గంపూడి రంజిత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేం ప్రశ్నించాలి.. మీరు సమాధానం చెప్పాలి. అంతే తప్ప ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజలు గనుక తిరుగుబాటు చేస్తే ఈ ప్రభుత్వం చెత్తబుట్టలోకి పోవడం ఖాయం” అని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

అర్ధరాత్రి అరెస్టులు సమంజసం కాదు.

తెల్లవారుజామున 3, 4 గంటల సమయంలో నాయకుల ఇండ్లపై పడి అరెస్టులు చేయడం ఏంటని రంజిత్ రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు. “కార్యకర్తల ఇండ్లల్లో చిన్న పిల్లలు, వృద్ధులు, పేషంట్లు ఉంటారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున ఇండ్లలోకి చొరబడి భయాందోళనలు సృష్టించడం సమంజసం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లన్నీ మా బిఆర్ఎస్ కార్యకర్తలతోనే నిండిపోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులకు మా మద్దతు ఉంటుంది..

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడవద్దని ఆయన కోరారు. “ఈ ప్రభుత్వం ఉండేది మరో రెండు సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ తర్వాత పోలీస్ మిత్రులకు కూడా మేమే అండగా నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి చట్టాన్ని గౌరవించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి” అని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అణచివేత చర్యలకు బిఆర్ఎస్ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.