Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మేడిగడ్డను వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ అంతా నీళ్లు పారిస్తాం: కేటీఆర్

Author MANA VISHWAM | 05 Jul 2026, 04:37 PM | జయశంకర్ భూపాలపల్లి
మేడిగడ్డను వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ అంతా నీళ్లు పారిస్తాం: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
​కేటీఆర్ మాట్లాడిన ప్రధానాంశాలు వారి మాటల్లోనే..

​కుట్ర పూరితంగానే పిల్లర్ల కుంగుబాటు?

మేడిగడ్డను వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ అంతా నీళ్లు పారిస్తాం: కేటీఆర్ - Additional Image

​"370 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజిలో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అవి కూడా సరిగ్గా ఎన్నికల ముందే కేసీఆర్ గారి పేరును బద్నాం చేయడానికి ఎవరో కావాలనే చేశారనే బలమైన అనుమానం మాకు ఇప్పటికీ ఉంది."

​ఆ కుంగిన రెండు పిల్లర్ల బ్లాక్ మొత్తాన్ని మళ్లీ తిరిగి నిర్మించడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.400 కోట్లు అని, ఆ మొత్తాన్ని తామే పూర్తిగా భరిస్తామని నిర్మాణ సంస్థ L&T ముందుకు వచ్చినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. అయినప్పటికీ 31 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం L&T సంస్థను రిపేర్ చేయనివ్వకుండా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

​లక్ష క్యూసెక్కుల నీరు సముద్రం పాలు..

​అసలు వర్షపాతం లేకున్నా నీళ్లు దొరికే ఒకే ఒక అద్భుతమైన ప్రాంతం కన్నెపల్లి పంప్ హౌస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఈ రోజు కూడా లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే చాలు.. రాష్ట్రమంతా నీళ్లు సరఫరా చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రతీకారమే ఎక్కువైంది" అని ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

​తుమ్మిడిహట్టి కథ.. కాంగ్రెస్ టైంపాస్!

​గతంలో తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల డ్యామ్ ఎత్తు పెంచడానికి ఒప్పుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేసీఆర్ స్వయంగా సంప్రదించారని కేటీఆర్ వివరించారు.152 మీటర్ల ఎత్తు పెంచితే తమ ప్రాంతాలు మునిగిపోతాయని మహారాష్ట్ర ఒప్పుకోలేదు.
​గతంలో ఆంధ్రప్రదేశ్‌లో, మహారాష్ట్రలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తుమ్మిడిహట్టి కడతామని కాలయాపన చేశారు తప్ప సాధించింది లేదు.మహారాష్ట్ర ఎంతకీ ఒప్పుకోకపోవడంతో కేసీఆర్ గారు చాకచక్యంగా వ్యవహరించి 148 మీటర్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

​కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మాణం

​ఎంతటి సూపర్ ఎల్‌నినో (కరువు) వచ్చినా కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉంటాయని ఇంజనీర్లు, CWC (సెంట్రల్ వాటర్ కమిషన్) చెప్తేనే కేసీఆర్ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారని కేటీఆర్ స్పష్టం చేశారు. "నేను పుట్టినప్పటి నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని వింటూనే ఉన్నాను, అది ఇంతవరకు పూర్తి కాలేదు. కానీ, కేసీఆర్ గారు కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి చూపించారు" అని కొనియాడారు.

​సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సవాల్..

​ప్రస్తుత ప్రభుత్వ చేతకానితనాన్ని విమర్శిస్తూ కేటీఆర్ ముఖ్యమంత్రికి ఓ బహిరంగ సవాల్ విసిరారు:
​"నీకు మేడిగడ్డ రిపేర్ చేసే తెలివి లేకపోతే.. ఒక్క వారం రోజులు ఆ బాధ్యతను కేసీఆర్ గారికి అప్పజెప్పు. మొత్తం తెలంగాణ అంతా నీళ్లు పారేలాగా చేసే పూర్తి బాధ్యత మాది."

​ఈ పర్యటనలో కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.