Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

"బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ఆ రూ.1400 కోట్లు అవినీతి సొమ్ము!"

"బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ఆ రూ.1400 కోట్లు అవినీతి సొమ్ము!"

‘కాళేశ్వరం’లో హరీశ్ రావు.. ‘అనుమతుల్లో’ కేటీఆర్ హస్తం

అమరవీరుల కుటుంబాలకు 'కోటి' చొప్పున పంచండి

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు

​తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ.. బీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణి రెండో విడత 'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
​తాను మళ్లీ గులాబీ గూటికి చేరుతున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
"నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ లోకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ అధ్యాయం ముగిసిపోయింది!"​ అని కవిత అత్యంత భావోద్వేగంగా స్పష్టం చేశారు.


​రూ.1,400 కోట్ల గుట్టు రట్టు.. కోటి రూపాయల డిమాండ్!

ఇవి కూడా చదవండి


​బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ నిధులన్నీ తీవ్ర అవినీతి ద్వారా సమకూరినవేనని తేల్చిచెప్పారు. ఆ పాపపు సొమ్మును తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీకి 'టీఆర్ఎస్' పేరు రాకుండా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమపై భయం లేదంటూనే ఎన్నికల సంఘానికి వేలాది ఫిర్యాదులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


​కేటీఆర్, హరీశ్ రావులపై ‘బాంబు’ పేల్చిన కవిత!


​కాళేశ్వరం ప్రాజెక్టు, భూకేటాయింపుల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల లీలలను ఆమె ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్ రావు పాత్ర స్పష్టంగా ఉందని, అలాగే కేటీఆర్ తన సన్నిహితులకు అక్రమంగా భూకేటాయింపులు, నిర్మాణ అనుమతులు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం నుండి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రైతులను ముంచడానికే ప్రస్తుత ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రైతు భరోసా, ఎరువుల పంపిణీ, పంటల బోనస్.. ఇలా ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.


​సింగరేణి గనుల దోపిడీపై పోరాటం.. దీక్షకు సై!


​సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. నిజాం కాలంలో కేటాయించిన 17 బొగ్గు గనుల్లో ప్రస్తుతం కేవలం ఒక్క గనిని మాత్రమే అప్పగించారని, మిగిలిన 16 గనులను కూడా తక్షణమే సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాడిచర్ల–2 గని బాధ్యతలను సింగరేణికే అప్పగించాలన్నారు. వారసత్వ ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని, లేనిపక్షంలో సింగరేణి కార్మికుల హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహారా దీక్ష కు కూర్చుంటానని హెచ్చరించారు.
"రైతులు, కార్మికులు, ఉద్యమకారుల పక్షాన మా పోరాటం ఆగేది లేదు. రాజకీయ విమర్శలకు ప్రజా సమస్యలతోనే సమాధానం చెబుతాం!"​ అని కవిత స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.