Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

బావబామ్మర్దుల 'అధికార' ఆరాటం!

Author MANA VISHWAM | 10 Jul 2026, 11:46 AM | TELANGANA
బావబామ్మర్దుల 'అధికార' ఆరాటం!

'పెండింగ్ కమీషన్ల' కోసమే మూడు నెలల మంత్రి పదవి అడుగుతున్నారా?

దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే హరీశ్, కేటీఆర్ డిమాండ్లు

ఫామ్‌హౌస్ నుంచి కాళేశ్వరం దాకా బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు

'ఎక్స్ 'మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు

ఇవి కూడా చదవండి


బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ అధికారంపై ఆరాటపడుతున్న తీరు "దొంగే స్వయంగా వచ్చి ఇల్లు తాళం చెవులు కూడా నాకే ఇవ్వండి అన్నట్టుగా ఉంది" అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీపై పట్టుకోసం బావబామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరు ఫామ్‌హౌస్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు విస్తరించిందని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్ వేదికగా మంత్రి, గులాబీ పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


'కమీషన్ల' కోసమే మంత్రి పదవి కావాలా?


బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే విషయం హరీశ్ రావు, కేటీఆర్‌కు స్పష్టంగా అర్థమైందని పొంగులేటి వ్యాఖ్యానించారు. అందుకే ఒకరు "వారం రోజులు సమయం ఇవ్వండి", మరొకరు "మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి బాధ్యతలు అప్పగించండి" అంటూ అధికారాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హరీశ్ రావును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పెండింగ్ కమీషన్లు మిగిలిపోయాయా? వాటిని వసూలు చేసుకోవడానికే ఇప్పుడు మూడు నెలలు మంత్రి పదవి కావాలంటున్నారా? మీకు ఇంత పదవి వ్యామోహమా?" అని ప్రశ్నించారు.


కాళేశ్వరం పేరుతో రాజకీయాలు


కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా ఉపయోగించుకుందని ప్రజలందరికీ తెలుసని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ఇప్పుడు అదే కాళేశ్వరం పేరుతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ధనాన్ని దోచుకున్న వారే, ఇప్పుడు మళ్లీ బాధ్యతాయుతమైన పదవులు కోరడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోందని, వారి రాజకీయ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.