Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

షాబాద్ హంతకుడికి రక్తపాతం కోరుకుంటున్న రేవంత్ కు తేడా లేదు :హరీష్ రావు

Author MANA VISHWAM | 11 Jul 2026, 10:04 PM | TELANGANA
షాబాద్ హంతకుడికి రక్తపాతం కోరుకుంటున్న రేవంత్ కు తేడా లేదు :హరీష్ రావు

రేవంత్‌ రెడ్డి వైఖరి అత్యంత జుగుప్సాకరం

​వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'కాళేశ్వరం' డైవర్షన్ డ్రామాలు

షాబాద్ హంతకుడికి రక్తపాతం కోరుకుంటున్న రేవంత్ కు తేడా లేదు :హరీష్ రావు  - Additional Image

​హింసాత్మక వ్యాఖ్యలపై ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలి

ఇవి కూడా చదవండి


​ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి నీళ్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు, రిటైర్డ్ ఇంజనీర్లు కోరుతుంటే.. రక్తాన్ని పంటలపై చల్లాలని, బెల్టుతో కొట్టాలని సీఎం మాట్లాడటం దుర్మార్గమన్నారు. రక్తపాతాన్ని కోరుకుంటున్న రేవంత్ రెడ్డికి, షాబాద్ దైవాలగూడలో ఆరు హత్యలు చేసిన కిరాతకుడికి ఏమాత్రం తేడా లేదనిపిస్తోందని శనివారం 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
​పోలీసుల నిర్లక్ష్యం వల్ల బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ పోక్సో నిందితుడు మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబంలో ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపినా, ఆ హంతకుడిని పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట అని హరీశ్ రావు విమర్శించారు. ఈ శాంతిభద్రతల వైఫల్యం, ప్రజల తీవ్ర ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే రేవంత్ సర్కార్ మళ్లీ కాళేశ్వరం, మేడిగడ్డ అంటూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపిందని ఆరోపించారు. గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని తాము తపన పడుతుంటే, సీఎం మాత్రం తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల పొలాలను ఎండబెడుతున్నారన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకాలను తెలంగాణ రైతాంగం గమనిస్తోందని, రాబోయే రోజుల్లో ఈ చేతకాని ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హరీశ్ రావు హెచ్చరించారు.