Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి

Author MANA VISHWAM | 13 Jul 2026, 09:41 PM | TELANGANA
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి

​దిల్లీలో తెలంగాణ గళం బలంగా వినిపించండి

​రాజకీయాలకు అతీతంగా కలిసి నడుద్దాం

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి - Additional Image

​ఎంపీలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి భేటీ

ఇవి కూడా చదవండి

​హైదరాబాద్‌,జులై 13(మన విశ్వం): రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఎంపీలకు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాలపై శనివారం ప్రజాభవన్‌లో ఎంపీలతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎంపీలు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.


​ప్రధాన డిమాండ్లు.. కార్యాచరణ ఇదీ

•​నగరంలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు.
•​మెట్రో ఫేజ్‌-2 విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. దీనిపై బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించేలా ఒత్తిడి తేవాలన్నారు.
•​ టెండర్ల దశకు వచ్చిన ఈ పనులను 'అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌' కిందకు తెచ్చేందుకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలవాలని సూచించారు.
​ •తుంగభద్ర పూడికతీత, గోదావరి-సాగర్‌ అనుసంధానంపై కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలవాలన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులకు ఏపీ నుంచి ఎన్‌వోసీలు సాధించాలని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని పేర్కొన్నారు.
•​భూసేకరణ పూర్తయిన ఆదిలాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాల్లో కార్గో, ఎంఆర్‌వో సేవలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
•​ఎంపీలకు దిల్లీలో అవసరమైన సమాచార సమన్వయం కోసం తెలంగాణ భవన్‌లో ఐఏఎస్‌ అధికారి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ను నియమించినట్లు సీఎం వెల్లడించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్‌ డా. మల్లు రవికి సూచించారు.