Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

భవితకు ‘ఫ్యూచర్‌’ బాట!

Author MANA VISHWAM | 15 Jul 2026, 10:50 PM | హైదరాబాద్
భవితకు ‘ఫ్యూచర్‌’ బాట!

​భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్

​మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

​రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌కు పిలుపు

​2034 నాటికి వన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

​తెలంగాణను 2034 నాటికి అగ్రగామిగా నిలిపి, వన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక శక్తంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్’ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యూచర్‌ సిటీ ప్రస్థానంలో ఈ డేటా సెంటర్‌ తొలి, అత్యంత కీలకమైన అడుగు అని అభివర్ణించారు.
​రాబోయే 14 ఏళ్లలో అమెజాన్‌ సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 58 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనుందని సీఎం తెలిపారు. ఇదే జోరుతో తెలంగాణపై నమ్మకంతో 2034 నాటికి తమ పెట్టుబడులను రూ. లక్ష కోట్లకు పెంచాలని ఆయన అమెజాన్‌ ప్రతినిధులను కోరారు. ఇందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని, పెట్టుబడుల పురోగతిని ప్రతి నెలా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.

​మూడు మండలాలుగా విభజన.. ఇదీ ప్రణాళిక!

​రాష్ట్ర సమగ్ర వికాసం కోసం పారిశ్రామిక రంగాన్ని మూడు మండలాలుగా (త్రీ జోన్స్‌) వర్గీకరించి సరికొత్త కార్యాచరణను రూపొందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ అభివృద్ధి ‘త్రిశూలం’
1. ఓ ఆర్ ఆర్ లోపలి ప్రాంతం- సేవా రంగం
2. ఓ ఆర్ ఆర్ - ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతం- తయారీ రంగం
3. ట్రిపుల్ ఆర్ అవతలి ప్రాంతం- వ్యవసాయ ఆధారితం

లక్ష్యం.. దేశ జీడీపీలో పది శాతం!

​"దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతమే. కానీ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి మనం అందిస్తున్న వాటా ఐదు శాతం. దీనిని 2047 నాటికి పది శాతానికి పెంచడమే మా సంకల్పం" అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్పటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చుతామన్నారు. ఇందుకోసం సింగిల్‌ విండో విధానంలో వేగంగా అనుమతులు ఇస్తున్నామని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్‌’ గ్లోబల్‌ సదస్సుకు 108 దేశాల ప్రతినిధులను, 3 వేలకు పైగా కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించడం కూడా ఫార్చ్యూన్-500 సంస్థలను ఆకర్షించే వ్యూహంలో భాగమేనని వివరించారు.

​కాలుష్య రహిత ‘మూసీ’.. గ్రీన్ హైదరాబాద్‌

​హైదరాబాద్‌ను పర్యావరణహిత మహానగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమలను నగర శివార్లకు తరలిస్తున్నామని, మూసీ నది ప్రక్షాళనను వేగవంతం చేశామని చెప్పారు. నగరంలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తున్నామని, విద్యుత్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

​రైతుల త్యాగం అమూల్యం!

​"పరిశ్రమలు, నగరాభివృద్ధి కోసం భూములు ఇస్తున్న రైతుల త్యాగాన్ని ఈ ప్రభుత్వం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. వారికి మరింత మెరుగైన నష్టపరిహారం అందించి, అండగా ఉంటాం. నీరు, నిధులు, నిరంతర విద్యుత్‌, నైపుణ్యం కలిగిన యువతే పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చబోతున్నాయి."
- ఎ. రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
-