Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఎర్రకోట చుట్టూ.. భద్రతా వలయం!

Author MANA VISHWAM | 16 Jul 2026, 10:26 PM | NATIONAL
ఎర్రకోట చుట్టూ.. భద్రతా వలయం!

నేటి నుంచి నెల రోజుల పాటు పర్యాటకులకు అనుమతి నిరాకరణ

స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో పురావస్తు శాఖ నిర్ణయం

ఆగస్టు 16 నుంచి తిరిగి సందర్శనకు అవకాశం

దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వేదికైన చారిత్రక ఎర్రకోట.. ముందస్తు భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఆగస్టు 15న ఎర్రకోట ప్రాంగణంలో నిర్వహించే జాతీయ వేడుకల ఏర్పాట్లు, భద్రతా కారణాల దృష్ట్యా నెల రోజుల పాటు సాధారణ పర్యాటకుల సందర్శనను నిలిపివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ప్రకటించింది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.


​నిఘా నీడలో పరిసరాలు

​ఆగస్టు 15న దేశ ప్రధాని ఎర్రకోట బురుజుల పైనుంచి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, వీఐపీల భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఏర్పాట్లలో పాల్గొనే సిబ్బంది, తగిన అనుమతి పత్రాలు కలిగిన రక్షణ, పోలీసు శాఖల అధికారులను మాత్రమే ప్రస్తుతం కోట లోపలికి అనుమతిస్తున్నారు.​ఎర్రకోట పరిసర ప్రాంతాలను ఇప్పటికే రక్షణ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనుమానిత కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి


​సహకరించాలని విజ్ఞప్తి

​దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల నిర్వహణకు పర్యాటకులు, స్థానిక ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు ఎర్రకోట మూసివేత దృష్ట్యా.. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం, ఆగస్టు 16 నుంచి ఎర్రకోటను తిరిగి యథావిధిగా తెరుస్తామని పురావస్తు శాఖ వెల్లడించింది.