Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

విజిలెన్స్ ‘నజర్’ పడేనా.. గుట్టు రట్టయ్యేనా?

Author MANA VISHWAM | 17 Jul 2026, 01:33 PM | హన్మకొండ
విజిలెన్స్ ‘నజర్’ పడేనా.. గుట్టు రట్టయ్యేనా?

హన్మకొండ ధాన్యం రవాణా స్కాంపై నిఘా నిశ్శబ్దం వీడేది ఎప్పుడు?

​కమలాపూర్ సెక్టార్‌ దోపిడీపై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగాలని ప్రజాసంఘాల డిమాండ్!

​లారీల్లో ధాన్యం తరలించకుండానే కోట్ల బిల్లుల చెల్లింపు..

కాంట్రాక్టర్-అధికారుల కుమ్మక్కుపై విచారణ జరిగేనా?

​హన్మకొండ,జులై 16(మన విశ్వం): హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో కమలాపూర్ సెక్టార్ కేంద్రంగా సాగిన ధాన్యం రవాణా మహా కుంభకోణంపై "విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్" విచారణ జరుగుతుందా? అసలు నిఘా వర్గాలు ఈ దోపిడీపై నజర్ వేస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. లారీలతో ధాన్యం తరలించకుండానే, కాగితాల్లో రవాణా జరిగినట్లు చూపిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ భారీ స్కాంలో అసలు సూత్రధారులు, పాత్రధారుల గుట్టు రట్టు కావాలంటే ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ ఒక్కటే శరణ్యమని పౌర సమాజం గట్టిగా డిమాండ్ చేస్తోంది.


​విజిలెన్స్ రంగంలోకి దిగితేనే తేలే నిజాలు!

​ఈ కుంభకోణంలో నిఘా విభాగం లోతుగా విచారణ చేపడితే తప్ప బయటపడని కొన్ని కీలక నిజాలు ఇక్కడ ఉన్నాయి.
​రవాణా చేసినట్లు చూపించిన లారీల నెంబర్లు నిజంగా మిల్లుల్లోకి ధాన్యం తరలించాయా? లేక తూతుమంత్రంగా లారీ నెంబర్లను సృష్టించి బిల్లులు క్లెయిమ్ చేశారా అనేది విజిలెన్స్ తనిఖీల్లోనే తేలాల్సి ఉంది.
​ధాన్యం తరలింపు జరిగినట్లు చెప్తున్న మిల్లుల్లోని సీసి కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే సదరు లారీలు అసలు ధాన్యం తీసుకొని మిల్లుల్లోకి వెళ్లాయా లేదా అనే ఆధారాలు విజిలెన్స్ సేకరిస్తే కాంట్రాక్టర్ ఆట కట్టు కావడం ఖాయం.
​క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రెండేళ్లుగా కోట్ల రూపాయల బిల్లులపై సంతకాలు చేసిన ఉన్నతాధికారుల అసలు రంగు విజిలెన్స్ విచారణలోనే బయటపడుతుంది.

ఇవి కూడా చదవండి


​నిఘా నీడలోకి వెళ్లాల్సిన కోట్ల రూపాయల దోపిడీ లెక్కలు

​గత రెండేళ్లుగా విజిలెన్స్ కళ్లు కప్పి సాగించిన అడ్డగోలు రవాణా బిల్లుల చెల్లింపుల వివరాలు ఇవి
2024-25 ఖరీఫ్:రూ.1,41,72,404 (కోటి నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల నాలుగు)

2024-25 రబీ:రూ.1,34,58,760.61 (కోటి ముప్పై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల అరవై)

2025-26 ఖరీఫ్:రూ 1,41,72,404 (కోటి నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల నాలుగు)

2025-26 రబీ:రూ 63,30,800 (అరవై మూడు లక్షల ముప్పై వేల ఎనిమిది వందలు)
రెండు సంవత్సరాలనుండి చెల్లించిన బిల్లు మొత్తం రూ.4,81,34,368.61 (నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల పైచిలుకు)
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మరో రూ. 1కోటి పైచిలుకు బిల్లులను కూడా చకచకా క్లియర్ చేసేందుకు అధికారులు తెరవెనుక శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం!


​అధికారుల్లో మొదలైన వణుకు.. విచారణకు ఆదేశించేనా?

ధాన్యం రవాణా స్కాం పై "మనవిశ్వం దినపత్రిక "​ వార్తలు వెలుగులోకి తీసుకురాడంతో హన్మకొండ పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కలకలం మొదలైంది. ఎక్కడ తమపై విజిలెన్స్ నిఘా పడుతుందో, ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని కొందరు అధికారులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణమే సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా? లేక కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన పౌరసరఫరాల సంస్థ అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తారా? అనేది వేచి చూడాలి.